![]() |
![]() |
.webp)
కొంతమంది ఏం మాట్లాడినా ఫేమస్ అయిపోతారు. ఉడతా ఉడతా ఊచ్ అంటు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ట్యాలెంట్ చూపించిన రతికరోజ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలని నెటిజన్లతో పంచుకుంది. అవి ఇప్పుడు ఇన్ స్ట్రాగ్రామ్ లో ఫుల్ వైరల్ గా మారాయి.
బిగ్ బాస్ సీజన్ సెవెన్ రతిక అనగానే గుర్తొచ్చే మరో ఇద్దరు ప్రశాంత్, యావర్.. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొదటి రెండువారాల్లో రతిక ఆట చూసి ఈసారి టాప్-5 లో గ్యారెంటీగా ఉంటుందనుకున్నారు. హౌస్ లో సీక్రెట్ రూమ్ కి రతికని పిలిచి ఉడతా ఉడతా ఊచ్ పాట ప్లే చేసి ఎన్నిసార్లు ఉడతా అని వచ్చిందో బిగ్ బాస్ చెప్పమన్నప్పుడు .. సరిగ్గా లెక్కవేసి చెప్పినందుకు నాగార్జునతో పాటు ఆడియన్స్ షాక్ అయ్యారు. ఇంత ఇంటలిజెన్స్ గేమ్ ప్లేయర్ బిగ్ బాస్ సెవెన్ లో ఉందా అని అనుకున్నారంతా.. కానీ ఆ తర్వాత ప్రశాంత్ కలిపిన పులిహోర సరిగ్గా రాకపోయేసరికి అభిమానులు తెగ ద్వేషించారు. ఇక ప్రశాంత్ తో గొడవ జరిగిన నాటి నుండి యావర్ ని అమర్ అని అనడం.. ఒకే ప్లేట్ లో కలిసి తినడం చూసి అంతా మరో బకరా రెడీ అని ట్రోల్స్ చేశారు. అయితే తన నేచర్ ని చూసి ఇంత కన్నింగ్, ఫ్లిప్పింగ్ ఎవరు లేరని అర్థమైపోయింది. సోషల్ మీడియాలోని నెటిజన్లు ఒకకానొక దశలో తను రతిక పాప కాదు డీజే టిల్లు సినిమాలోని రాధిక పాప అని కూడా అన్నారు. అలా తనకి నెగెటివ్ టాక్ వచ్చేసింది.
రతిక తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మి క్వశ్చనింగ్ స్టార్ట్ చేసింది. ఇందులో తనని ఫ్యాన్స్ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగగా వాటికి సమాధానమిచ్చింది రతిక. మీ ఫేవరెట్ కర్రీ ఏంటని అడుగగా.. మటన్ కర్రీ విత్ వైట్ రైస్ అని అంది. ట్రైన్ కి ఉంటాయి పట్టాలు.. రిలేటివ్స్ ని అంటారు చుట్టాలు.. దేవుడు ఇస్తే వరాలు.. చేసుకుంటా నిన్ను ప్రియురాలు అని ఒకరు అనగా స్మైలీ సింబల్ రిప్లై గా ఇచ్చింది. పల్లవి ప్రశాంత్ తో లవ్ ప్రాంక్ చేయండి అని ఒకరు అడుగగా.. అది అర్థం చేసుకునేంత మెచురిటీ ప్రశాంత్ కి రాలేదు. ఎందుకంటే అతను సెన్సిటివ్ అండ్ ఎమోషనల్. నేను ఫేక్ గా లవ్ లో ఉండలేనని రిప్లై ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో ఎవరంటే ఇష్టమంటే.. శివన్న అని రిప్లై ఇచ్చింది. రతిక మా కోసం ఓ పాట పాడండి అని ఒకరు అడుగగా.. ఇన్ ట్రెస్టింగ్ థింగ్స్ కమింగ్ ఆన్ వే.. వెయిట్ ఫర్ ఇట్ అని రిప్లై ఇచ్చింది.
![]() |
![]() |